తెలంగాణ టూరిజం మరియు భాషా సాంస్కృతిక శాఖ , జీ.హెచ్.ఎం.సి వారి సౌజన్యం తో వీవ్ మీడియాస్ సంస్థ నిర్వహిస్తున్న ప్రైడ్ అఫ్ హైదరాబాద్ అవార్డుల ప్రధానోత్సవం కు వివిధ రంగాల నుంచి దాదాపు 75 మంది అవార్డులకు ఎంపిక అయినట్టు నిర్వాహుకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16 రవీంద్ర భారతి నందు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు హోం శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అలీ గారి తో పాటు టూరిజం శాఖా మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ గారు, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్ర రెడ్డి , వికలాంగుల శాఖా సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు గౌరవ అతిథులుగా ,తెలంగాణ ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ డి.దివ్య గారు , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు అతిధులుగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమానికి ఫోటో మామ, డిజిటల్ కనెక్ట్, వందే భారత్, భారత్ సేవ సంస్థలు సపోర్టెడ్ స్పాన్సర్ ఉన్నాయి. ఈ సందర్భంగా
వీవ్ మీడియాస్ సంస్థ వ్యవస్థాపకురాలు కొప్పుల వసుంధర మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేస్తున్న స్థానికులు ,స్థానికరేతులు , ఎన్.ఆర్.ఐ లు అర్హులుగా అవార్డులకు నామినేషన్స్ ప్రకటించమని ,దానికి విశేష స్పందన వచ్చిందని, అవార్డులు ఇవ్వడమే కాకుండా అన్ని రంగాల వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి రానున్న రోజులలో ప్రైడ్ అఫ్ హైదరాబాద్ ఒక కమ్యూనిటి సంస్థగా రూపొందించి యువతకు ముఖ్యంగా దివ్యాంగులకు ప్రోత్సాహం అందిస్తామని అందులో భాగంగానే దేశం లోనే మొదటి దివ్యాంగుల ఇంకుబేషన్ సెంటర్ డీ హబ్ ను తెలంగాణ రాష్ట్రం లో స్థాపించబోతున్నామని , దివ్యాంగులను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు వస్తున్న ఢీ హబ్ లో భాగంగా తెలంగాణ టూరిజం శాఖతో కలిసి యాక్సిస్బుల్ టూరిజం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బియాండ్ ద బ్రిడ్జ్ ట్రావెల్ షో చేయబోతున్నామని అలాగే తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ తో కలిసి కల్ట్ హబ్ అకాడమీ స్థాపించబోతున్నామని తెలిపారు..
Invited Mr Mamidi Harikrishna for the Pride of Hyderabad – 2022
Mamidi Harikrishna is an Indian Telugu poet, illustrator, translator, documentary filmmaker, movie critic[1] and Historian on Telangana state history and Films. He is currently the director of Language and Culture department of the Telangana government