మనో విజ్ఞాన్ అభ్యసన యాత్ర ద్వారా ఈ.అభ్యాస్ అకాడమి ఫౌండర్ డా.ఫణి పవన్, సూపర్ ఫౌండేషన్ సుధీర్ సండ్ర వారి బృందం కలిసి ఆంధ్ర & తెలంగాణ
రెండు తెలుగు రాష్ట్రాలలో
30 రోజులపాటు 30 జిల్లాలు పర్యటించి 35 వేల మందికి అవగాహన కల్పించారు.
30 రోజుల మనోవిజ్ఞాన అభ్యసన యాత్రలో భాగంగా పదోతరగతి విద్యార్థులకు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, మానసిక ఆరోగ్యం పై దృష్టి సారించి అనే అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 300 కి పైగా ఈ.అభ్యాస్ అకాడమి అనుబంధ స్కూల్స్ విద్యార్థులకు చైతన్యం కల్గించడానికి నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ యాత్ర నిర్వహించడం జరిగిందనీ వారు తెలిపారు.
35 వేల మంది విద్యార్థులు, 5 వేల కిలోమీటర్లు, 30 ఈవెంట్లు, 30 జిల్లాలు, 30 రోజులు, 2 రాష్ట్రాలు, 1 మిషన్ – మనో విజ్ఞాన అభ్యసన యాత్ర జరిగిందన్నారు.
యాత్రలో పాల్గొనేవారికి మానసిక ఆరోగ్యం విషయాలను సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర అలానే విద్యార్థులకు పరీక్షలకు కావలసిన మెళకువలు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ మెంట్ టెక్నిక్స్ విషయాలని డాక్టర్ ఫణి పవన్ తెలిపారు.
అలానే తల్లిదండ్రులకు చిట్కాలు, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార అవకాశాలు ఇలా వివిధ అంశాలను కవర్ చేస్తూ ఉన్న ప్రత్యేక పుస్తకాలను సుమారు 35 వేల మందికి ఉచితంగా
పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ.అభ్యాస్ అకాడమి సీఈవో డా.ఫణి పవన్ మాట్లాడుతూ కరోనా పాండమిక్ తర్వాత విద్యార్థుల ఆలోచనలో అనేక మార్పులు రావటం, చదువు పైన శ్రద్ధ లేకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నారని
ఈ సమస్యలని పరిష్కరణ కోసం మరియు వారిని సరైన మార్గంలో పెట్టడానికి తమ 300 కు పైగా ఉన్న అసోసియేట్ స్కూల్స్ కి మరియు ట్రస్మా , అపుస్మా స్కూల్స్ కి తన వంతు బాధ్యతగా విద్యార్థులను చైతన్యవంతులు చేద్దామని మొదలుపెట్టిన ప్రయాణం నేడు ముగిసి విజయోత్సవ సభ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంద అన్నారు.
ఈ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నుండి మానసిక అవగాహన పై చైతన్యం కల్పించుట ఒక అడుగు ముందుకు వేస్తూ సహకరించారనీ అన్నారు.
ఎడిట్ పాయింట్ రమేష్, నిఖిల్, సూపర్ ఫౌండేషన్ సహకరించారని పేర్కొన్నారు